నవతెలంగాణ – కేరళ: కేరళలోని నీలంబూర్ లో మంగళవారం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎల్‌కేజీ చదువుతున్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుందగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి. సయన్ మహ్మద్ అనే ఐదేళ్ల పిల్లాడిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తన ఇంటికి కేవలం 50 మీటర్ల దూరంలోని ఈ ఘటన జరిగింది. సమీపంలో ఫుట్ బాల్ ఆడుతున్న స్థానికులు గమనించి కుక్కల నుంచి చిన్నారిని రక్షించే ప్రయత్నం చేశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దాడిలో సయన్ ముఖంతో పాటు ఇతర ప్రాంతాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారిని తొలుత నిలంబూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. గాయానికి సంబంధించిన మందులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో మంజేరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లాడి పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.