ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించిన అబ్జర్వర్ గోపాల్జీ తివారి ఐఏఎస్ 

నవతెలంగాణ – మద్నూర్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న జరిగే జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లను జహీరాబాద్ పార్లమెంట్ అబ్జర్వర్ గోపాల్జి తివారి ఐఏఎస్ శనివారం మద్నూరు మండల కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అబ్జర్వర్ పరిశీలనలో ఆయన వెంట జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నిక జుక్కల్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అబ్జర్వర్ గా వచ్చిన ఐఏఎస్ గోపాల్జి తివారి మద్నూర్ మండల కేంద్రంలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, పోలింగ్ కేంద్రాలను, అదేవిధంగా ఈరోజు ఎన్నికల ఈవీఎం యంత్రాలకు నిర్వహిస్తున్న కమిషనింగ్ జరుగుతున్న  వాటిని పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి సూచించారు ఎన్నికలకు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తపరిచారు.

Spread the love