మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

Arvind Kejriwalనవతెలంగాణ – న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు. ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించి నేడు విచారణకు రావాలని ఈడీ (ED) అధికారులు కేజ్రీవాల్‌కు ఆరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణకు సీఎం హాజరుకావడం లేదని ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. సమన్లు చట్ట వ్యతిరేకమని పేర్కొన్నాయి. ఈడీ సమన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపాయి. కోర్టులో కేసు ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపుతున్నదని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చేవరకు ఈడీ ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న కేజ్రీవాల్‌.. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌, విశ్వాస తీర్మానం కారణంగా తాను ప్రత్యక్షంగా కోర్టుకు రాలేకపోయానని వివరించారు. మార్చి 16న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు.

Spread the love