Monday, June 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంకితభావంతో ప్రజలకు సేవలందించాలి

అంకితభావంతో ప్రజలకు సేవలందించాలి

- Advertisement -

ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు 
గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

అంకిత భావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశా నిర్దేశం చేశారు. సోమవారం హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్‌‌డీలో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు, సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శాంతి కుమారి ఆధ్వర్యంలో గవర్నర్ ను లోక్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ల ను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలన్నారు. పరిపాలనలో నిజాయితీ గొప్ప బలమనీ, అది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందని చెప్పారు. ప్రతి పౌరుని సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కారం చూపాలన్నారు. పదవి ఒక అధికారం మాత్రమే కాదనీ, అది ఒక బాధ్యత” అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ రాష్ట్రాభివృద్ధికి, సమాజ పురోగతికి కీలకంగా మారాలని సూచించారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణా చారి తదితరులు పాల్గొన్నారు.

సరస్వతి అంత్య పుష్కరాలకు రండి గవర్నర్ కు దేవాదాయ శాఖ ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరవ్వాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవదాయ శాఖ ఆహ్వానించింది. మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు గవర్నర్ ను లోక్ భవన్‌లో సోమవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు తదితరులున్నారు.

​ఎప్‌సెట్ ‌టాపర్‌కు గవర్నర్ అభినందన
తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిని మల్లాడి రుషిని గవర్నర్ శివ ప్రతాప్‌ ‌శుక్లా సోమవారం లోక్ భవన్ లో అభినందించారు. ఈ సందర్భంగా రుషి సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఆమె కృషి, పట్టుదలతో పాటు తల్లిదండ్రులు, అధ్యాపకుల సహకారం కూడా అభినందనీయమన్నారు ​గవర్నర్‌ను కలిసిన గిగ్ కార్మికుల సంఘం ప్రతినిధులు
తెలంగాణ గిగ్, ఫ్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, పలువురు యూనియన్ ప్రతినిధులు లోక్ భవన్‌ లో సోమవారం గవర్నర్ ను కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -