ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరపత్రాల ఆవిష్కరణ

నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పొగాకు వ్యతిరేక దినోత్సవ కరపత్రాల ఆవిష్కరణ జిల్లా జడ్జి సునీత కుంచాల కరములచే నిర్వహింప చేయడమైనదని క్లబ్ అధ్యక్షులు సతీష్ షాహ తెలిపారు. ఈ విధంగా వీరు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పొగాకును నిషేధించి మంచి సమతుల్య ఆహారం తీసుకొని చక్కని జీవనాన్ని ఆస్వాదించాలని కోరారు. అనంతరం జిల్లా జడ్జి గౌరవనీయులు శ్రీమతి సునీత కుంచాల గారు మాట్లాడుతూ నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని చక్కటి కార్యక్రమంతో ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఉద్దేశంతో రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ ఏర్పాటు చేయడం ఒక చక్కటి సందేశాన్ని సమాజానికి అందించడం గౌరవప్రదమైన కార్యక్రమమని అన్నారు. తదనంతరం తెలుపుతూ నేటి యువత పొగాకు, మద్యపానం, మాదకద్రవ్యాలు వంటి వాటికి దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవితంలో ఒక నిర్ణాత్మకమైన గౌరవప్రదమైన సంస్థలలో స్థిరపడి నలుగురికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. పొగాకు వల్ల అనేక రకాల జబ్బులు దరి చేరుతాయని అందుకే వాటికి దూరంగా ఉండి డి అడిక్షన్ సెంటర్లలో సంప్రదించి తమకు ఉన్నటువంటి అలవాట్లను దూరం చేసుకోవడానికి రోటరీ క్లబ్ నిజామాబాద్ వారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని వారికి సంప్రదిస్తే తగిన సూచనలు తెలియజేస్తారని అన్నారు. అనంతరం క్లబ్ ప్రధాన కార్యదర్శి ఇండియన్ సైకియాట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ ప్రతినిధులు ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ మొదట ఈ కార్యక్రమం నిర్వహించడంలో మాకు సహకరించినటువంటి జిల్లా జడ్జి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేటి యువత సమాజంలో మాదకద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను కోల్పోతున్నారని పొగాకు, గుట్కా, పాన్ పరాక్, సిగరెట్ , మాదకద్రవ్యాలు మందు వంటి వాటికి బానిస అవడం మంచిది కాదని త్వరితగతిన తెలుసుకొని సూచనలు జాగ్రత్తగా చక్కని జీవితాన్ని సమతుల్య ఆహారాన్ని తీసుకొని పోషకమైన బలవంతమైన జీవితాన్ని గడపాలని అన్నారు. ఎవరికైనా ఈ మాదక ద్రవ్యాల పై ఎటువంటి సందేహాలు ఉన్నాగాని నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మాదకద్రవ్య నిర్మూలన వంటి వాటిపై డి అడిక్షన్ సెంటర్ ద్వారా సూచనలు జాగ్రత్తలు వంటి తెలియజేస్తూ సహకారం అందిస్తారని దీనికై 9 2 4 6 9 9 0 5 నెంబర్ కు సంప్రదించి తమ పేరును నమోదు చేసుకొని డాక్టర్ గారిని కలవవచ్చని కోరడం జరిగింది. కార్యక్రమంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులు కటకం శ్రీనివాస్, రాజ్ కుమార్ సుబేదార్, ఆర్.జగదీశ్వరరావు వి. శ్రీనివాసరావు, పార్సి రాజేశ్వర్, సుధీర్ గుప్తా, డిఎల్ఎస్ఏ సూపర్డెంట్ పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Spread the love