రైలు కింద పడబోయిన యువ‌తిని కాపాడిన మ‌హిళా కానిస్టేబుల్

నవతెలంగాణ – హైద‌రాబాద్ : బేగంపేట రైల్వే స్టేష‌న్‌లో ఓ యువ‌తి ప్రాణాల‌ను ఆర్‌పీఎఫ్ మ‌హిళా కానిస్టేబుల్ కాపాడింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో బేగంపేట స్టేష‌న్‌కు లింగంప‌ల్లి – ఫ‌ల‌క్‌నూమా ఎంఎంటీఎస్ రైలు చేరుకుంది. అయితే క‌దులుతున్న ఈ రైలును ఎక్కేందుకు స‌ర‌స్వ‌తి అనే యువ‌తి ప్ర‌య‌త్నించింది. కానీ రైలు వేగంగా ముందుకు క‌ద‌ల‌డంతో ఆమె ప్ర‌య‌త్నం విఫ‌ల‌మై ప్లాట్‌ఫాం, రైలు మ‌ధ్య‌ ప‌డ‌బోయింది. అక్క‌డే ఉన్న ఆర్‌పీఎఫ్ మ‌హిళా కానిస్టేబుల్ కే స‌నిత అప్ర‌మ‌త్త‌మై.. స‌ర‌స్వ‌తిని వెన‌క్కి లాగింది. దీంతో ఆమె ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. కానిస్టేబుల్ స‌నిత‌పై రైల్వే అధికారులు, నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. న‌ల్ల‌గొండ‌కు చెందిన కే స‌నిత 2020లో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ప్ర‌స్తుతం బేగంపేట రైల్వే స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తుంది.

Spread the love