ఆర్థిక శాఖ చుట్టూ..
ఆయా ఇంజినీరింగ్ శాఖల్లో బిల్లుల చెల్లింపు కోసం కాంట్రాక్టర్ల నుంచి తీవ్రంగా ఒత్తిడి పెరగడంతో ఉన్నతాధి కారుల్లో అసహానం పెరుగు తున్నది. ఒకానొక సంద ర్భంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ లకు, కాంట్రాక్టర్లకు కార్యాలయాల్లో వాదో పవాదాలు జరుగుతున్నాయి. దీంతో వారు సచివాల యంలోని ఆర్థికశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుం డటం తెలిసిందే.
భగీరథ ఆఫీసు దగ్గర ధర్నా
మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం వద్ద పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు సర్వసాధారణమయ్యాయి. గత సోమవారం భగీరథ కార్యాలయం ఎదుట ఇంట్రా విలేజ్ కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలంటూ ధర్నా చేశారు. సుమారు రూ.300 కోట్లు తమకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందంటూ నిరసన తెలిపారు. ఇందులో ఎక్కువగా చిన్న కాంట్రాక్టర్లే ఉండటం తెలిసిందే. సుమారు రూ. 1400 కోట్లు పెండింగ్ బిల్లులు ఆ శాఖలో ఉండగా, ఇటీవల రూ. 400 కోట్ల మేరకు ఆయా కాంట్రాక్టు సంస్థలకు బకాయిలు ఇచ్చేశారు. ఇంకా రూ.1000 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాగా భగీరథ అప్పులు తీర్చేందుకు అసలు, వడ్డీ కలిపి ప్రభుత్వం రూ.4900 కోట్ల దాకా ఆయా బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్నది. అలాగే రూ. 700 కోట్ల మేర రోడ్లు, భవనాల శాఖలో బిల్లులు ఇవ్వాల్సి ఉన్నట్టు సమాచారం. ఇకపోతే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్‌లో దాదాపు రూ.500 కోట్లకుగాను ఇటీవల రూ.100 కోట్లు ఇచ్చేసింది. ఇంకా రూ.400 కోట్లు మిగిలే ఉన్నాయి.
రూ. 8 వేల కోట్లపైమాటే
సాగునీటిశాఖలోనే రూ.6300 కోట్లు
భగీరథలో రూ. 1000 కోట్లు
ఆర్‌అండ్‌బీ. పీఆర్‌లో రూ.1100 కోట్లు
కాంట్రాక్టర్లలో అసహనం
ధర్నాలకు దిగుతున్న వైనం
సర్కారుపై తీవ్ర ఒత్తిడి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ప్రతిష్టాత్మక పథకాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. నాలుగైదు నెలల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు ధర్నాలకు దిగుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రధానంగా ఇంజినీరింగ్ శాఖల్లో ఈ వాతావారణం ఏర్పడింది. ఉన్నతాధికారులపై ఒత్తిడి తీవ్రమైంది. సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖ, మిషన్ భగీరథ, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. ఆర్థిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అవి సఫలీకృతం కావడం లేదు. కార్పొరేట్ సంస్థలు, ప్రయివేటు కంపెనీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏండ్ల తరబడి బకాయిలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యధికంగా సాగునీటి శాఖలో ఉండటం గమనార్హం. కేసీఆర్ సర్కారు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఖర్చుచేసిన సంగతి తెలిసిందే.మొత్తం సుమారు రూ. 8,400 కోట్లకుపైగా ఇంజినీరింగ్ శాఖల్లో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఆ బిల్లుల్లో దాదాపు 50 శాతం పెండింగ్‌లో ఉండటం సర్కార్ ప్రతిష్టకు భంగం కలుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిక్త హస్తాన్ని చూపు తున్న నేప థ్యంలో నిధుల సమీకరణ విష యంలో నిరం తరం అప్పులవైపు దృష్టిసారించక తప్పని దుస్థితి ఎప్పటినుంచో ఉంది.
ఇరిగేషన్‌లో భారీ బకాయిలు
సర్కారు సవాల్‌గా తీసుకుని చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రధాన మైనవి సాగునీటి పథకాలే కావడం గమనార్హం. ఇందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అధికంగా వ్యయం చేయడమూ తెలిసిందే. కాళేశ్వరం రూ. 2800 వేల కోట్లు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషణ్‌కు చెందినవి రూ.2,300 కోట్ల దాకా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆ తర్వాత సీతారామ ఎత్తిపోత పథకానికి రూ.500 కోట్లు, ఎల్లంపల్లి వాటా కింద రూ.400 కోట్లు, డిండివి రూ.300 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే సర్కారు మార్జిన్ మనీ కింద చెల్లించాల్సిన నిధులే రూ. 2100 కోట్లకుపైగా ఉన్నా యని సమాచారం. ఇందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే రూ. 1600 కోట్ల వరకు ఉండగా, సీతారామ ప్రాజెక్టువి రూ.560 కోట్ల దాకా ఉన్నట్టు తెలిసింది. ఇవన్నీ రుణాలు తీసుకునే క్రమంలో ప్రభుత్వం మార్జిన్ మనీగా ఇస్తామన్న నిధులు సైతం ఉండటం గమనార్హం. ఇకపోతే భూసేకరణ పద్దు కింద ఆయా ప్రాజెక్టులకు కట్టాల్సినవి రూ.1100 కోట్లుగా ఉండగా, పునరావాసం, పునర్‌నిర్మాణం కింద రూ.151 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. ఇక పనులకు సంబంధించి బిల్లులు రూ.3800 కోట్లకుపైగా ఉన్నట్టు సమాచారం.