ప్రజలకు కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేశాయో చెప్పాలి

– ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-బేగంపేట్‌
ప్రజలకు ఏం చేశారని చేసిన పనులు చెప్పాకే కాంగ్రె స్‌, బీజేపీ పార్టీలు ఓట్లు అడగాలని మాజీమంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. సోమవారం వెస్ట్‌ మారేడ్‌ పల్లిలోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అద్యక్షతన సనత్‌ నగర్‌ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్ధి పద్మారావు గౌడ్‌ కు మద్దతుగా ఎన్నికల ప్రచార రధాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని విమర్శిం చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే వందకు పైగా ఉన్నాయని, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తాము చేసిన అభివద్ధి ఒక్కటైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన మేలు, చేసిన అభివద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజల మద్య ఉండే పద్మారావు గౌడ్‌ గెలుపు ఖాయం అని స్పష్టం చేశారు.
25న నియోజకవర్గ సమావేశం
25న ప్యాట్నీ సర్కిల్‌ వద్ద గల మహబూబ్‌ కాలేజీ ఆవరణలో గల ఎస్‌వీఐటీ ఆడిటోరియంలో సనత్‌ నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పద్మారావు గౌడ్‌లు హాజరవుతారని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని పార్టీ కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్‌ లు, డివిజన్‌ అద్యక్షులు, పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్‌ నాయకులు, ఉద్యమ కారులు, పార్టీ అభిమానులను ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌లు కొలన్‌ లక్ష్మి, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్‌ ఆకుల రూప, డివిజన్‌ అద్యక్షులు కొలన్‌ బాల్‌రెడ్డి, అత్తిలి శ్రీనివాస్‌ గౌడ్‌, వెంకటేషన్‌ రాజు, హన్మంతరావు, ఆకుల హరికష్ణ, శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు తలసాని స్కై లాబ్‌ యాదవ్‌, అశోక్‌ యాదవ్‌, ప్రవీణ్‌ రెడ్డి, కర్ణాకర్‌ రెడ్డి, నాగులు, శ్రీకాం త్‌ రెడ్డి, ఏసూరి మహేష్‌, లక్ష్మీపతి, ప్రేమ్‌ కుమార్‌, రమణ, కూతురు నర్సింహ, గోపిలాల్‌ చోహాన్‌, బాసా లక్ష్మి, లలితా చౌహాన్‌, నాగమణి, రాణి కౌర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love