నవతెలంగాణ – హైదరాబాద్
భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించారు. ఈ మేరకు ఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం ప్రారంభమైన జీ20 సమావేశంలో ప్రధాని మోదీ ప్రకటించారు. సభ్యులందరి అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ అధినేత అజాలీ అసౌమనీని శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.