ప్రేమ్‌ కుమార్‌ పెళ్ళి కష్టాలు

హీరో సంతోష్‌ శోభన్‌ ‘ప్రేమ్‌ కుమార్‌’గా నవ్వుల్లో ముంచెత్తటానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై శివ ప్రసాద్‌ పన్నీరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ సింగ్‌, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటిస్తు న్నారు. కష్ణ చైతన్య, కష్ణ తేజ, సుదర్శన్‌, అశోక్‌ కుమార్‌, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తు న్నారు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
‘ప్రేమ్‌కుమార్‌ వ్యథ పేరుతో రిలీజైన ఈ ట్రైలర్‌లో హీరో క్యారెక్టరైజేషన్‌ను ఆసక్తి కరంగా మలిచారు. తనకి పెళ్లి వయసు వచ్చిందని హీరో పెళ్లి చేసుకోవా లనుకుంటాడు. కానీ ఏదో ఒక కారణంతో అతని పెళ్లిళ్లు ఆగి పోతుంటాయి. దీంతో హీరోని అందరూ ఆట పట్టిస్తుంటారు. చివరకు విసిగిపోయిన హీరో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుని ఓ డిటెక్టివ్‌ ఏజెన్సీ పెట్టు కుంటాడు. అప్పుడు అతనికి హీరోయిన్‌ పరిచయం అవు తుంది. అయినప్పటికీ హీరోకి పెళ్లి అవుతుందా? లేదా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేంటున్నారు దర్శక, నిర్మాతలు. కథలో ట్విస్టులు మీద ట్విస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి.
వైవిధ్యమైన టీజర్‌తో ఆకర్షించిన మేకర్స్‌.. ఇప్పుడు ట్రైలర్‌ను అంతకు మించిన ఎంటర్‌టైన్‌ మెంట్‌తో మిక్స్‌చేసి రిలీజ్‌ చేయడం విశేషం.

Spread the love