ముందస్తు అరెస్టులు రాజ్యాంగ విరుద్ధం..

– పాలడుగు వెంకటకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ముందస్తు అరెస్టులు రాజ్యాంగ విరుద్ధమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుల నిర్బంధంపై మాట్లాడారు. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా అవినీతి, అక్రమాలను అడిగితే అక్రమ కేసులా?ఇది ప్రజాస్వామ్యమా లేక కీచక రాజ్యమా? అని ప్రశ్నించారు.రాహుల్ గాంధీ పై పరువునష్టం దావా కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడతారని ముందస్తు పోలీసులు అరెస్టులు చేయడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు.  మోడీ లంతా కేడిలే అన్నందుకు రాహుల్ గాంధీ పై సూరత్ జిల్లా కోర్టులో పరువునష్టం దావా కేసు వేస్తూ బీజేపీ ఎంపీ పిటిషన్ దాఖలు చేయగా అట్టి పిటిషన్ విషయంపై గుజరాత్ హైకోర్టుకి స్టే ఇవ్వాలని కోరగా, అక్కడ కూడా చుక్కెదురు అయింది అని రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ జిల్లా కోర్టుకు మద్దతు ఇవ్వగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  పై కావాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ప్రధాని మోదీ  తన స్నేహితులకు, ముఖ్యంగా గుజరాతీ కంపెనీలకు దేశ సంపదను దోచి పెడుతున్నారని అన్నందుకే ఇవ్వాళ పార్లమెంట్ బహిష్కరణ చేశారని అన్నారు. గుజరాత్ జిల్లా కోర్టు ఇచ్చిన అక్రమ తీర్పుపై న్యాయ పోరాటం చేయకుండా మమ్మల్ని పోలీసులు అడ్డగించడం అప్రజాస్వామికం అని, ప్రజాస్వామ్యంలో పోరాటం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, అక్రమ అరెస్టులు మా పోరాటాన్ని ఆపలేవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, పస్రా గ్రామ ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, పంగ శ్రీను, జక్కు రణదీప్, పత్రి మధు, ఎట్టి ప్రవీణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love