రాయ్ బరేలీ నుంచి ప్రియాంక ఎన్నికల అరంగేట్రం!

నవతెలంగాణ – ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా, గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా భావించే రాయ్ బరేలీ లోక్ సభ స్థానంలో అభ్యర్థి ఎంపిక దాదాపు ఖరారైందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానం నుండి సోనియా గాంధీ తన కూతురు ప్రియాంక గాంధీని నిలబెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రంపై చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలు కూడా చేపడతారని  ప్రచారం జరిగింది. అయితే, తాజాగా రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం దాదాపుగా కన్ఫార్మ్ అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు.

Spread the love