సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ..

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిన అనంతరం అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లను కలిసిన రేవంత్ రెడ్డి.. కొద్దిసేపటిక్రితం సోనియా గాంధీ కలిశారు. ఈ సందర్భంగా రేపు తన ప్రమాణస్వీకారానికి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అలాగే ఢిల్లీలో  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మర్యాద పూర్వకంగా కలిసి ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు.

Spread the love