ఎమ్మెల్యే రాములు నాయక్కు నిరసన సెగ..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కు నిరసన సెగ ఎదురయ్యింది. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కారేపల్లి మండలం దుబ్బ తండాలో ఎమ్మెల్యే రాములు నాయక్ ను అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏం లేదంటూ నిలదీశారు. ఎమ్మెల్యే రాములు నాయక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారు. దీంతో చేసేదేం లేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Spread the love