ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పుర్ర నర్సింలు

నవతెలంగాణ – రాయపోల్

తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పుర్ర నర్సింలు మాదిగను నియమించినట్లు ఎమ్మార్పీఎస్ (మాదిగ రాజకీయ పోరాట సమితి) వ్యవస్థాపక అధ్యక్షులు బి. ఎన్ రమేష్ కుమార్ మాదిగ తెలిపారు గురువారం హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో పుర్ర నర్సింలుకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుర్ర నర్సింలు మాట్లాడుతూ ఎన్నో రోజుల నుండి మాదిగ జాతి హక్కులు,ప్రయోజనాల కోసం ఎమ్మార్పీఎస్ లో పని చేయడం జరుగుతుందని తన పనితనాన్ని గుర్తించి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ కుమార్  మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను నిస్వార్ధంగా జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలకు మేరకు మాదిగ ప్రజలను చైతన్యం చేస్తానని, మాదిగల హక్కుల  ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు పోతానని ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలందర్ని ఏకతాటి తెచ్చి ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పేర్కొన్నారు.
Spread the love