కాంగ్రెస్ గూటికి చేరనున్న రాజగోపాల్ రెడ్డి!

నవతెలంగాణ హైదరాబాద్: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ(BJP) నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajgopal Reddy) బ్యాక్ టు పెవిలియన్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.‌ అటు ఆయన సైతం ఖండించకపోవడం‌…బీజ్రేపీ నిన్న ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం చర్చకు మరింత ఊతాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్(Congress)లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి ప్రజల నుంచి ఉందని చెప్పారు. ఈ విషయంపై సాయంత్రంలోపు స్పష్టత వచ్చే అవకాశముంది.

Spread the love