రాజీవ్ తర్లేజా, QL One అధ్యరంలో PROFICORN 2023.

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద బిజినెస్ కోచింగ్ కంపెనీ అయినటువంటి QL One, మే 23 మరియు 24 తారీఖుల్లో మధ్య, చిన్న తరహా పరిశ్రమల బిజినెస్ యజమానుల కోసం ఒక అద్భుతమైన ఈవెంట్ ను నిర్వహించింది. PROFICORN 2023 పేరుతో నిర్వహించిన ఈ అద్భుతమైన ఈవెంట్ కు ఆసియా ఖండం నుంచి దాదాపు 650 మందికి పైగా వ్యాపార యజమానులు బెంగళూరుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు విజయవంతంగా జరిగింది. ఈ ఈవెంట్ లో 6గురు అద్భుతమైన స్పీకర్స్ మరియు బిజినెస్ లీడర్స్ పాల్గొని తమ విలువైన సలహాలు అందించి బిజినెస్ యజమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. మాట్లాడిన వారిలో భారతదేశపు అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జీరోదా వ్యవస్థాపకుడు బిలియనీర్ నితిన్ కామత్, ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిత్తి, సన్ రైజ్ క్యాండిల్స్ వ్యవస్థాపకుడు భవేష్ భాటియా, భారతదేశపు డిజిటల్ కామర్స్ లో అతి పెద్ద మైక్రో డిస్ట్రిబ్యూటర్ నెట్ వర్క్ కలిగిన జూజుల్ వ్యవస్థాపకుడు రాజేష్ దెంబ్లా, భారతదేశంలో ఎక్కువమందికి అత్యంత ఇష్టమైన ఐస్ క్రీమ్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకులైన రఘునందన్-సిద్ధార్థ్ కామత్ ఉన్నారు. రాజీవ్ తర్లేజాతో మాటామంతీ సందర్భంగా నితిన్ కామత్ మాట్లాడుతూ.. వ్యాపార యజమానులుగా, మీ గేమ్‌ను నిరంతరం మెరుగుపర్చుకుంటూ ఉండాలి. అలాగే క్యూరియాసిటీ ఫ్యాక్టర్‌ ఎప్పటికీ తగ్గిపోకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం. ఈ క్యూరియాసిటీ ఫ్యాక్టరే మనకు తెలియని ఎన్నో సరికొత్త అవకాశాలు కల్పిస్తుంది అని అన్నారు. ప్రశాంత్ పిత్తి మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే పారిశ్రామికవేత్త కావాలనే కోరిక భారతదేశంలో చాలా ఎక్కువ. అందుకే రాబోయే సంవత్సరాల్లో దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య మరింత పెరుగుతుందని నేను నమ్ముతున్నాను అని అన్నారు. ఈ ఈవెంట్ లో QL Oneతో కోచింగ్ ఎంగేజ్ మెంట్స్ పూర్తైన తర్వాత 9 మంది వ్యాపారస్థులు తమ విజయ గాథలను అందరితో పంచుకున్నారు. వీరంతా మహమ్మారి సమయాన్ని ఎదుర్కున్నారు. అలాగే కుటుంబంలో వచ్చిన ఇబ్బందులను కూడా అధిగమించి, ఇంకా చెప్పాలంటే జీరో నుంచి మొదలుపెట్టి ఇప్పుడు తమ వ్యాపారాలను లాభాల బాట పట్టించి, తమ వ్యాపార సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు. ఆ తర్వాత తమ వ్యాపారంలో అద్భుతమైన నైపుణ్యంతో విజయాలు సాధించి అందరికి మార్గదర్శకులుగా నిలిచిన 30 మంది వ్యాపారస్తులకు బిజినెస్ సక్సెస్ అవార్డ్‌ లను అందించారు. వీరంతా QL One వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకుని.. తమ వ్యాపారంలో అద్భుతమైన విజయాలను చూసినవారే. ఈ సందర్భంగా PROFICORN 2023 లో QL ONE వ్యవస్థాపకుడు మరియు సహా వ్యవస్థాపకుడు అయినటువంటి రాజీవ్ తర్లేజా-కరణ్ హాసిజా QL ONE యాప్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యాపార అభివృద్ధి కోసం పాటుపడుతున్న చిన్న, మధ్య తరహా వ్యాపార యజమానులకు వ్యాపారాభివృద్ధికి ఈ యాప్, ఇందులో ఉన్న ఫీచర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ యాప్‌తో పాటు, మొట్టమొదటి బిజినెస్ సక్సెస్ మ్యాగజైన్ ను PROFICORN 2023లో ఆవిష్కరించారు. ఈ మ్యాగజైన్ లో చిన్న మరియు మధ్య తరహా వ్యాపార యజమానుల స్ఫూర్తిదాయకమైన కథనాలు, వారు తమ వ్యాపారంలో ఎలా అభివృద్ధి సాధించారు లాంటి అంశాలు ఉంటాయి. ఈ సందర్భంగా తర్లేజా మాట్లాడుతూ… QL One మరియు మ్యాగజైన్ యొక్క అంతిమ లక్ష్యం ఒక్కటే.. చిన్న, మధ్య తరహా వ్యాపార యజమానుల అభివృద్ధి కోసం. అందుకే బిజినెస్ సక్సెస్ మ్యాగజైన్ ప్రతీ ఎడిషన్ లో తమ వ్యాపారాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్న వారి విజయగాథలు ఇందులో ఉంటాయి. ఈ ఈవెంట్ లో ఇండస్ట్రీలో ఉన్న అద్భుతమైన ట్రైనింగ్ మరియు కోచింగ్ నిపుణులు పాల్గొన్నారు. వారంతా కలిసి QL One ద్వారా తమ తమ విభాగాల్లో బిజినెస్ యజమానులకు ఉన్న సందేహాలకు తీర్చే ప్రయత్నం చేశారు. ఈ PROFICORN 2023 కార్యక్రమంలో 650 మందికి పైగా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఇలాంటి PROFICORN 2023 కార్యక్రమం చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులకు చాలా అవసరం. ఇలాంటి వాటి వల్ల ఇతర వ్యాపారాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, వాళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటివి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అని ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ముక్తకంఠంతో చెప్పిన మాట.

Spread the love