జూన్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దాదాపు అందరూ డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తున్నారు. అయినా బ్యాంకు శాఖల్లో ఆర్థిక లావాదేవీలు, ఆర్థికేతర లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి రావచ్చు. కనుక బ్యాంకు శాఖలకు వెళ్లే వారు ఒకసారి బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో చెక్ చేసుకుంటే బెటర్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మే నెల ముగింపునకు వస్తున్నది. మరో ఆరు రోజుల్లో మరో నెల చరిత్ర కాల గమనంలో కలిసిపోనున్నది. వచ్చే గురువారం నుంచి జూన్ నెల ప్రారంభం కానున్నది. జూన్ నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వాటిల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు రోజులు దేశవ్యాప్తంగా సెలవు. మిగతా ఆరు రోజుల్లో వివిధ కారణాలతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
జూన్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా..
4 – ఆదివారం – దేశమంతటా సెలవు
10 —రెండో శనివారం– దేశమంతటా సెలవు
11 — ఆదివారం— దేశమంతటా సెలవు
15 — రాజా సంక్రాంతి— మిజోరం, ఒడిశా
18 — ఆదివారం — దేశమంతటా సెలవు
20 — కంగ్ రధయాత్ర— మిజోరం, ఒడిశా
24 —నాలుగో శనివారం — దేశమంతటా సెలవు
25 — ఆదివారం — దేశమంతటా సెలవు
26 — ప్రత్యేక పూజలు — త్రిపుర
28 — ఈద్ ఉల్ అజా— కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్
29 — ఈద్ ఉల్ అజా — పలు రాష్ట్రాల్లో సెలవు
30 — రీమా ఈద్ ఉల్ అజా – మిజోరం, ఒడిశా
ఈ నెల 24 నుంచి 26 వరకు త్రిపురలో మూడు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవు. 24న నాలుగో శనివారం, 25న ఆదివారం, 26న ఖచి పూజ కారణంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు.

Spread the love