- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిందం మల్లికార్జున్ సోదరుడి వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సామాజికవేత్త, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ హాజరై, నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ బల్గురి మధుసూదన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జక్క రాఘవేందర్ రెడ్డి, తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, ఉప సర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, నల్ల మాసం సత్యనారాయణ గౌడ్, మట్ట ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



