జన సేన సమావేశంలో మాట్లాడుతున్న రామచంద్ర రావు

– వేడెక్కుతున్న రాజకీయాలు
– ప్రజలకు చేరువ అవుతున్న పార్టీలు
– అశ్వారావుపేట లోనూ జనసేన ఉనికి కి కోసం పాట్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం దానికి తగ్గట్టుగానే తెలంగాణ కోనసీమగా గుర్తింపు ఉన్న అశ్వారావుపేట లోనూ వడగాల్పులు వీస్తున్నాయి.వేడెక్కిన భౌగోళిక వాతావరణ మాదిరిగానే రాజకీయ వాతావరణాన్ని ఇక్కడ రాజకీయ నాయకులు హీట్ ఎక్కిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలు పేరుతో,కాంగ్రెస్ కన్నడ విజయంతో,వామపక్షాలు సమ్మెలు,సభలో సమావేశాలు,భాజపా,తెదేపా,జన సేన,పొంగులేటి సైన్యం లు ఏదో ఒక ఎజెండాతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే జన సేన సైతం అశ్వారావుపేట లో తన ఉనికి కై కార్యాచరణ చేపట్టింది.జన సేన నియోజక వర్గ సమన్వయ కర్త డేగల రామచంద్ర రావు(రాము) నేతృత్వంలో గురువారం మండలంలోని వినాయకపురం లో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా లో జన సేన పార్టీ బలోపేతం మే లక్ష్యంగా పార్టీలో పనిచేసే కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి నాయకులు,ప్రజాప్రతినిధుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడమే ధ్యేయం గా గ్రామస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఇకనుండి పూర్తి స్థాయిలో మండల,గ్రామ కమిటీలు వేసి పార్టీ నీ గ్రామస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వారు తెలిపారు. ఇందులో బాగంగా వినాయకపురం లో ప్రచార పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దామెర బాబీ, ఇస్లావత్ వినోద్, లింగిశెట్టి కుమార్ స్వామి, గుమ్మల్ల పోషి, మళ్ళం రామక్రిష్ణ, మడకం అశోక్, ముత్యాలరావు, నరేష్, చంటి, ప్రసాద్, రమేష్ లు పాల్గొన్నారు.

Spread the love