నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని 22న (సోమవారం) విడుదల చేయనున్నట్టు పోలీసు నియామక మండలి వెల్లడించింది. కానిస్టేబుల్ సివిల్, పీసీ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఐటీ తత్సమాన పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ కీని www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచునున్నట్లు పేర్కొంది. అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5గంటల లోపు తెలియజేయాలని వెల్లడించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రోఫార్మాను వెబ్ సైట్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. ఫైనల్ కీని విడుదల చేసే సమయంలో అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను సైతం వారి లాగిన్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది.