విధి వంచితులకు కొత్త రూపం

నవతెలంగాణ-కంటేశ్వర్

ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవత్వంతో ఆలోచిద్దాం కార్యక్రమం పేరిట నేడు బోధన్, నిజామాబాద్ లో రోడ్లపైన  నిస్సహాయక స్థితిలో  విదివంచితులుగా తిరుగాడే వారిని గుర్తించి వారికి సపర్యసేవలు చేసారు. మండే ఎండలు ఆకలి మంటలు తెలీవు వారి ప్రయాణం ఎటో తెలియదు రోడ్లే వారికి ఆవాసాలు వారెవరో తెలీదు వారికెవరికి తెలియదు కంపుకోట్టే మురికిబట్టలు ఉటలు కట్టిన జుట్టుతో తిరుగాడుతూ ఉంటారు ఎందరి చిదరింపులో ఎదురుకుంటు ఒంటరి జీవనాన్ని సాగించే ఈ అనామిక విదివంచితులకు కోత్తరూపు తిసుకోచ్చి సపర్యసేవలు చేసారు.  పట్టణ పరిసరాల్లో  ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ చే‌సిన సేవలు చూసి పలువురు అభినంచారు. ఈ కార్యక్రమంలో బోధన్   నిజామాబాద్ పోలిస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, విజయ్, శివ,వినోద్, సాయి, విజ్ఞేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love