బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి రాజీనామా

నవతెలంగాణ – గోవిందరావుపేట
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సూరపనేని సాయికుమార్  తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో సూరపనేని సాయికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్ల తాను కలత చెందినట్లు, ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష పదవికి న్యాయం చేయలేనేమో అన్న సందిగ్ధ పరిస్థితుల్లో తానే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి ప్రమేయం లేకుండానే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామాను జిల్లా  పార్టీ నాయకులకు పంపినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరేది లేదని భవిష్యత్తు నిర్ణయం ఇంకా తీసుకోలేదని తనను నమ్ముకున్న ప్రజల నాయకుల కార్యకర్తల వారి అభిప్రాయనుసరము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. మరియు వ్యక్తిగత కారణాలవల్ల తాను దూరంగా ఉంటున్నను  అని అందుబాటులో ఉండను అని కూడా తెలిపారు. ఇంతకాలం మండల పార్టీ అధ్యక్షునిగా తనకు సహకరించిన నాయకులకు ప్రజలకు కార్యకర్తలకు సాయి కుమార్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Spread the love