ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి డిమాండ్లు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌కు వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

8 ఐకేపీ వీవోఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
8 కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి
8 రూ. 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి
8 సెర్ప్‌ నుంచి ఐడి కార్డులు ఇవ్వాలి
8 గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా వేతనాలు వీవోఏల వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలి.
8 జాబ్‌ చార్ట్‌లతో సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులతో సహా ఇతర పనులు చేయించరాదు.
8 వీవోఏల పైన మహిళా సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఎస్‌హెచ్‌జీలకు వీఎల్‌ఆర్‌, అభయహస్తం డబ్బులు చెల్లించాలి.
8 ఎస్‌హెచ్‌జీ/ వీఏ లైన్‌ మీటింగ్స్‌ రద్దు చేయాలి
8 అర్హులైన వీవోఏలను సీసీలుగా ప్రమోషన్స్‌ కల్పించాలి.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగులసంఘం (సీఐటీయూ) కోరింది. 34 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మె డిమాండ్ల పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలంటూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు విజ్ఞప్తి చేసింది. శనివారం ఈమేరకు యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్వీ. రమ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. రాజ్‌కుమార్‌, ఎం. నగేష్‌, ఆఫీస్‌ బేరర్లు సి. సుమలత, వి. వెంకటయ్య, కె. శరత్‌ కుమార్‌, సభ్యులు రాములు, కుమార్‌తోపాటు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి. వెంకటేష్‌ తదితరుల బృందం మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఐకేపీ వీవోఏల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. మరోసారి చర్చలు జరిపేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో గ్రామ స్థాయిలో 17,606 మంది వీవోలు (గ్రామ సంఘాల సహాయకులు) పని చేస్తున్నారని పేర్కొన్నారు. 19 ఏండ్ల నుంచి గ్రామాలలో మహిళల అభ్యున్నతికి మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు వారికి అవగాహన కల్పిస్తూ… చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా రుణాలు ఇప్పించి, తిరిగి సక్రమంగా రుణాలు చెల్లించే విధంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న లావాదేవీలన్నీ పుస్తకంలో పొందుపర చడం, సమావేశాలు నిర్వహించడం తదితర పనులు చేస్తారని పేర్కొన్నారు. మహిళా సంఘాల పనులే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్నిరకాల సంక్షేమ పథకాలను విజయవం తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంత కష్టపడుతున్న ప్పటికీ వీవోఏలకు సెర్ప్‌ నుంచి రూ.3,900 గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీవోఏలతో కొత్త, కొత్త సర్వేలు చేయిస్తూ పని భారం పెంచు తున్నారని తెలిపారు. న్యాయమైన సమస్యలు పరిష్కరిం చాలని చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ పనికి తగిన గుర్తింపుగానీ, వేతనంగానీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రోజు రోజుకు పని భారం పెంచుతూ పని భద్రత కల్పించ కుండా ఐకేపీ వీవోలేలను ప్రభుత్వం విస్మరిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా తమ న్యాయమైన సమ స్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరారు.

Spread the love