రేవంతే ముఖ్యమంత్రి : మోత్కుపల్లి జోష్యం

మోత్కుపల్లి జోష్యం
మోత్కుపల్లి జోష్యం

 నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు జోష్యం చెప్పారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, పార్టీ నేతలు ఐకమత్యంగా సాగి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మోత్కుపల్లి అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పగ్గాలను చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో పార్టీ పుంజుకుందన్నారు.

Spread the love