నవతెలంగాణ-మద్నూర్
గ్రామ పంచాయతీలలో 45 రోజులకు ఒకసారి నిర్వహించే సామర్థ్యం పెంపు అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షా సమావేశం మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఎంపీడీఓ సత్యనారాయణ అధ్యక్షతన ఎంపీఓ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ గ్రామాల సర్పంచులతో పాటు కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం అధికారులు గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఎంపీఓ రామ్మోహన్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏవో రాజు, పంచాయత్ రాజ్ శాఖ ఏఈ అరుణ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈ మహమూద్, ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, ఉపాధి హామీ ఎపిఓ పద్మ, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఉపాధి హామీ టెక్నికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జీపీ అభివృద్ధి కార్యకలాపాలపై సమీక్షా సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



