బీఆర్ఎస్ లో చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

నవతెలంగాణ – హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్పీ గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో గులాబీ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్ఎస్పీ అభిమానులు, కార్యకర్తలతో చర్చించి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ భవన్ నుండి ర్యాలీగా వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని సమాచారం.

Spread the love