చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

– పలువురికి గాయాలు..
నవతెలంగాణ-జిన్నారం
ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ శివారులో బుధవారం జరిగింది. జిన్నారం ఎస్‌ఐ విజయరావు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్‌ డిపోకు చెందిన ఏపీ29జెడ్‌1652 అనే నెంబర్‌ గల ఆర్టీసీ బస్సు బుధవారం నర్సాపూర్‌ నుంచి బయల్దేరి పటాన్‌చెరు వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో మార్గమధ్యంలో జిన్నారం మండ లం రాళ్లకత్వ శివారులోకి రాగానే.. రోడు పక్కనే ఉన్న ఓ చెట్టును బలంగా ఢకొీట్టింది. దాంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది.దాంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇమా మ్‌నగర్‌ గ్రామానికి చెందిన పద్మ, సులపల్లి గ్రామానికి చెందిన ఇంద్రేశం అక్షిత్‌ గౌడ్‌, నల్లగండ్ల సాయి బాలరాజ్‌, సంజన, సికింద్రాబాద్‌కు చెందిన రాజనోళ్ల లక్ష్మి, రాళ్లకత్వ గ్రామానికి చెందిన వడ్ల మంజుల, కండక్టర్‌ గొల్ల పోచయ్య, డ్రైవర్‌ ఎరుకల బుచ్చయ్యలతో పాటు పలువురికి గాయా లయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరరలించారు. కాగా బస్సు డ్రైవర్‌ ఎరుకల బుచ్చయ్య అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడపడంతో ప్రమాదం జరిగిందని ఇమామ్‌నగర్‌ గ్రామానికి చెందిన కమలమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయడిపన వారిని పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ కాటా శ్రీనివాస్‌ గౌడ్‌, జిన్నారం ఎంపీపీ దమ్మ గౌని రవీందర్‌ గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు దాసరి శ్రీకాం త్‌ రెడ్డి, జిన్నారం మండలం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ, ఇమామ్‌ నగర్‌ మల్లేష్‌ బందృం పరామర్శించింది.
ప్రమాదంపై డీఎస్పీ ఆరా..
పటాన్చెరువు డీఎస్పీ పురుషోత్తంరెడ్డి ఆసుపత్రిలో బస ు్స ప్రమాద బాధితులను పరామర్శించారు.ఘటనకు సంబం ధించిన అంశాలను ప్రమాదం తీరును తెలుస్సుకున్నారు.

Spread the love