అహ్మదాబాద్‌కు సచిన్, అనుష్క, దినేష్ కార్తీక్

నవతెలంగాణ- అహ్మదాబాద్: ఈరోజు భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం సచిన్ టెండూల్కర్, దినేష్ కార్తీక్, అనుష్క శర్మలు ఒకే విమానంలో అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో దీన ఫోటోను దినేష్ తన ఇన్స్టాలో పంచుకున్నారు.  ‘రాయల్టీ ఎట్ 35,000 ఫీట్’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. వీరితోపాటు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఇప్పటికే అమితాబ్, రజిని వంటి వారికి బీసీసీఐ గోల్డెన్ టికెట్ లను ఇచ్చింది. కాగా ఇవాళ పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్లో టాస్ బిగ్ ఫ్యాక్టర్ కాకపోవచ్చని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ లో మంచు ప్రభావం ఉండకపోవచ్చు. నా దృష్టిలో ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. కొత్త ఛాలెంజ్ లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పాక్ మంచి క్వాలిటీ ఉన్న జట్టు. గత రెండు మ్యాచుల్లో మేము బాగా ఆడాము. ఈ విన్నింగ్ ఫామ్ ను ఇలాగే కంటిన్యూ చేస్తాం’ అని తెలిపారు.

Spread the love