నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
విద్యార్థుల బలిదానం వల్ల సిద్ధించిన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అని టిజీవిపి నగర అధ్యక్షుడు అఖిల్ చారి అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా కు గౌరవ వందనం చేశారు. అనంతరం తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ చారి జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి 36వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ చారి మాట్లాడుతూ 77 స్వతంత్ర భారతదేశంలో విద్యారంగాన్ని పెద్దపీట వేసి విద్యారంగాన్ని విద్యార్థుల సమస్యలను పరీక్షించకపోవడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు విద్యారంగ సమస్యలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది ఆత్మబలిదానంతో వచ్చిన తెలంగాణ ది గ్రేట్ శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ విద్యార్థులను న్యాయవాదులను, విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులను ఒక్కసారిగా తన ఒంటి జ్వాలతో తెలంగాణ మలిదశ ఉద్యమానిక ప్రాణం పోసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోని పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న, దేనికోసమేన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కొట్లాడిన, విద్యా వ్యవస్థలను విద్యారంగ సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని, తప్పకుండా శ్రీకాంత చారి త్యాగాన్ని వృధా కనియకుండా రానున్న ఎలక్షన్ లో పున ఉద్యమానికి నాంది పలికి కుటుంబ రాజకీయాలను తరిమికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సోహెల్, మహేష్, సుజిత్, అదీప్ తదితరులు పాల్గొన్నారు.