రాహుల్ గాంధీకి మళ్లీ అదే బంగళా కేటాయింపు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరగడంతో రాహుల్ గాంధీకి ఢిల్లీలో అధికారిక బంగళాను ప్రభుత్వం తిరిగి కేటాయించింది. గతంలో ఆయన నివసించిన 12, తుగ్లక్ లేన్ బంగళాను తిరిగి ఆయనకు ఇవ్వాలని లోక్‌సభ హౌస్ కమిటీ నిర్ణయించుకుంది. పరువునష్టం కేసులో పార్లమెంటు సభ్యత్వాన్ని రాహుల్ ఇటీవల కోల్పోవడంతో నిబంధనల ప్రకారం గత ఏప్రిల్ 22న రాహుల్ తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. ఆ వెంటనే తన తల్లి సోనియాగాంధీ 10 జనపథ్ రెసిడెన్స్‌లో ఆమెతో పాటే ఉంటున్నారు. రాహుల్‌కు తమ ఇంట్లో నివాసం కల్పించేందుకు పలువురు పార్టీ నేతలు మందుకు వచ్చారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ‘స్టే’తో రాహుల్‌పై పడిన అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. దీంతో ఆయనకు ఇంతకుముందు కేటాయించిన బంగ్లానే తిరిగి లోక్‌సభ హౌస్ కమిటీ కేటాయించింది.

Spread the love