అ వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షులు సరస్వతి

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఐకేపీ వీఓఎలకు కనీస వేతనం రూ.16వేలు ఇవ్వాలని వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షులు సరస్వతి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్ర హీంపట్నం మండలం ఏపీఎం రవీందర్‌కు సమ్మె నో టీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. సెర్ఫ్‌ సంస్థలో 19 సంవత్సరాలుగా గ్రామాల్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వీఓఏలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మహిళ స్వ యం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి, వారికి అవగా హన కల్పిస్తూ చిన్న చిన్న వ్యాపారులు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. వారికి రుణాలు ఇప్పించి తిరిగి సక్రమంగా లోన్స్‌ చెల్లించే విధంగా గ్రామాల్లో పని చేస్తున్న విఓఏలకు రూ.3900 వేతనం ఇస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 ఏళ్లు దాటిన వీఓ ఏల బతుకులు మాత్రం ఏమాత్రం మారలేదని విమర్శించారు. వీఓఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గు ర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కనీస వేత నం రూ.16 వేలు ఇవ్వాలన్నారు. రూ.10 లక్షల సా ధారణ బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఆన్‌ లైన్‌ పనులు చేయించకూడదన్నారు. అర్హులైన వీఓ ఏలను సీసీలుగా ప్రమోషన్స్‌ కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 17606 మంది వీఓ ఏలు గత నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారు ణమన్నారు. వెంటనే వీఓఎల సమస్యలు పరిష్కరిం చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహి స్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బుట్టి బాల్‌ రాజ్‌, మండల కన్వీనర్‌ బుగ్గరాములు, వీఓఏలు రమాదేవి, విజయలక్ష్మీ, లలిత, శాంత, భాగ్య, కళావతి, జంగమ్మ, అనిత,శామల, అనురాధ, లావణ్య, మనిలిల తదితరులు పాల్గొన్నారు.

Spread the love