ఎంసీఎంసీ కేంద్రాన్ని సందర్శించిన సెంథిల్‌ కుమార్‌

– సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల అంశాలపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలి
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్లమెంటు ఎన్నికలను పురస్కరిం చుకుని జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో గల చీఫ్‌ పీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిట రింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌ను ఎన్నికల హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు సెంథిల్‌ కుమార్‌ బుధ వారం పరిశీలించారు. హైదరాబాద్‌, పార్ల మెంటు నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఏంసీఏంసీ ద్వారా చేపడుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏంసీఏంసీ కేంద్రంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిం చారు. అడ్వర్టైజ్మెంట్‌, చెల్లింపు వార్తల గుర్తింపు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇస్తున్న అనుమతులు, ఆయా రిజిస్టర్‌ల నిర్వహణ తీరు తెన్నులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల అంశాలకు సంబంధించి మరింత పకడ్బందీగా పర్యవేక్షించాలని ఎంసిఎంసి నోడల్‌ అధికారికి సూచించారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, తదితర సామాజిక మాధ్య మాలలో పార్లమెంట్‌ ఎన్నికలతో ముడిపడిన అంశాలను నిత్యం నిశితంగా పరిశీలించాలని సూచించారు. బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లకు సంబం ధించిన అభ్యర్థులు ఏంసీఏంసీ నుంచి తప్పని సరిగా అనుమతులు పొందాలని తెలిపారు. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ, ఎలక్షన్‌ ఎక్స్పెండిచర్‌ మానిటరింగ్‌ కమిటీ, ఎంసిసి నోడల్‌ అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు. అబ్జర్వర్‌ వెంట సీపీఆర్‌ఓ ముర్తుజా అలీ, ఎక్స్పెండిచర్‌ మానిటరింగ్‌ కమిటీ నోడల్‌ అధికారి శరత్‌ చంద్ర, సోషల్‌ మీడియా పర్యవేక్షిస్తున్న కమిటీ మెంబర్‌ డిప్యూటీ ఈ.ఈ నరసింగరావు సోషల్‌ మీడియాలో వచ్చిన ఫిర్యాదులను ఓ.ఎస్‌.డీ అనురాధను అడిగి తెలుసుకున్నారు. ఏంసీఏంసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love