పేద విద్యార్థుల చదువు కోసం వైఆర్‌పీ ఫౌండేషన్‌ కృషి

– చైర్మెన్‌ ఎలిశాల రవి ప్రసాద్‌
నవతెలంగాణ – చైతన్యపురి
సమాజంలోని పేద విద్యార్థుల చదువు కోసం వైఆర్‌పీ ఫౌండేషన్‌ ఎల్లప్పుడు కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మన్‌ ఎలిశాల రవి ప్రసా ద్‌ అన్నారు. ఫౌండేషన్‌ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధిం చిన విద్యార్థులను ఆర్కేపురంలోని ఫౌండేషన్‌ కార్యాలయంలో బుధవారం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ రవి ప్రసాద్‌ మాట్లాడుతూ ఫౌండేషన్‌ ద్వారా దాదాపు ఇంటర్మీడియట్‌ 28 మంది విద్యా ర్థులకు ఫీజులు చెల్లించినట్టు తెలిపారు. తమ ఫౌండేషన్‌ ద్వారా చదువుకున్న బొడ్డు నవీన్‌ సాయి అనే విద్యార్థి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. పదో తర గతిలో 12 మంది విద్యార్థులు ఫౌండేషన్‌ ద్వారా ఆర్థిక లబ్ది పొంది 9.5 గ్రేడ్‌ లో ఉత్తీర్ణత సాధించారన్నారు. భవిష్యత్‌లో కూడా పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు తమ ఫౌం డేషన్‌ ఎప్పుడు ముందుంటుందని హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో శరత్‌ చంద్ర, హేమ చంద్ర, ఎడ్ల కష్ణారెడ్డి, చకిలం శేషగిరి రావు, మురిశేట్టి శ్రీనివాస్‌, షణ్ముఖం, దయాకర్‌, వాసు, సిబ్బంది శాంతి, శ్రీదేవి పాల్గొన్నారు.

Spread the love