మరో ప్రపంచ స్వాప్నికుడు శ్రీశ్రీ : ఉప్పల

నవతెలంగాణ – నాగోల్‌
శ్రీశ్రీ మరో ప్రపంచ స్వాప్నికుడు, సమ సమాజ ప్రేమికుడు, ఆయనను తెలుగు సాహిత్యంలో మహా ప్రస్థానం శిఖరాగ్ర కవిగా నిలిపిందని రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ మాజీ చైర్మన్‌, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల శ్రీనివాస గుప్త అన్నారు. నాగోల్‌లోని కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ కాలనీలో ప్రముఖ సాంస్కతిక సంస్థ ఆకతి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి సభను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత శ్రీనివాస్‌ గుప్త మాట్లాడుతూ భావ కవిగా, విప్లవ కవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీశ్రీ..సంప్రదాయ కవిత్వానికి భిన్నంగా వాడుక భాషలోని పదాలతో గొప్ప భావాలను పలికించారని అన్నారు.అనంతరం ప్రముఖ సినీ కవి, దర్శకుడు డా. వడ్డేపల్లి కష్ణ మాట్లాడుతూ శ్రీ శ్రీ జీవిత పరిచయం చేస్తూ ఆయన రాసిన కావ్యాలను, కమనీయ సినీ గీతాలను విశ్లేషించి ప్రస్తావించారు. ఆకతి సుధాకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కోర్టు సొసైటీ అధ్యక్షుడు బాజి రెడ్డి శాయి రెడ్డి, బ్యాడ్మింటన్‌ అకాడమీ నిర్వాహకులు పిల్లలమర్రి రమేష్‌, ‘సాహితీ కిరణం’ సీనియర్‌ పాత్రికేయులు రామచంద్ర రావు , మదర్‌ థెరీసా ఫౌండేషన్‌ అధ్యక్షుడు చేపూరి శంకర్‌, పలువురు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

Spread the love