మెరిసిన సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా

Shiny Sift Kaur Samraబాకు (అజర్‌బైజాన్‌) : ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఐదు ఒలింపిక్‌ బెర్త్‌లు సాధించిన టీమ్‌ ఇండియా.. సోమవారం రోజు బెర్త్‌ సొంతం చేసుకుంది. మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఈవెంట్‌లో సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా రాణించింది. 21 ఏండ్ల సమ్రా నీలింగ్‌లో 192, ప్రోన్‌లో 199, స్టాడింగ్‌లో 198 పాయింట్లు సాధించి ఓవరాల్‌గా 429.1 (589)తో ఐదో స్థానంలో నిలిచింది. చైనా షూటర్లు పసిడి, రజతాలు నెగ్గగా.. అమెరికా షూటర్‌ కాంస్యం దక్కించుకుంది. పతకం చేజారినా 2024 ఒలింపిక్‌ బెర్త్‌ను సమ్రా సాధించింది. జట్టు విభాగంలో ఆషి చౌక్సి, కౌశిక్‌లతో కలిసి గురి పెట్టిన సమ్రా.. కాంస్య పతకానికి ఆరు పాయింట్ల దూరంలో నిలిచింది.

Spread the love