Wednesday, June 10, 2026
E-PAPER
Homeజాతీయంకాంగ్రెస్‌కు షాక్

కాంగ్రెస్‌కు షాక్

- Advertisement -

రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి బరిలో నిలిపిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంగళవారం నాడు తిరస్కరించా రు. ఆమె తన అఫిడవిట్‌లో ఒక క్రిమినల్ కేసు వివరాలను దాచిపెట్టారని బీజేపీ ఆరోపించడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో బిజెపికి చెందిన మహేష్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైంది. తెలంగాణలో కోర్టులో పెండింగ్‌‌లో ఉన్న ఒక కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి తన అఫిడవిట్‌‌లో పేర్కొనలేదని, అందువల్లే ఆమె నామినేషన్‌‌ను తిరస్కరించామని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్టాన పెద్దలు కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) అధికారులను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. కాగా కాంగ్రెస్‌ ‌విజ్ఞాపనపై బుధవారం నాడు సిఇసి స్పందించేవీలుంది.

కర్ణాటకకు చెందిన మీనాక్షి నటరాజన్‌..కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సన్నిహితురాలిగా పేరొందారు. ఆమె యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఈ స్థానంలో పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్‌కు బదులుగా మీనాక్షిని బరిలోకి దించడంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సింగ్‌కు బదులుగా మీనాక్షిని బరిలోకి దించితే, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపికి ఓటు వేయవచ్చని సీనియర్ నేత నరేష్ జ్ఞాన్‌చందాని ఇదివరకే పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వంతో సరైన సంప్రదింపులు జరపకుండా మీనాక్షిని బరిలోకి దించడం తగదని జ్ఞాన్‌చందాని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు మీనాక్షి నామినేషన్ దాఖలు చేశారు. ఆ వెంటనే జ్ఞాన్‌చందాని కాంగ్రెస్‌‌కు రాజీనామా చేశారు. దీంతో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న బిజెపి, మూడో సీటుకు తన అభ్యర్థిని ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని ఒక రిసార్ట్‌కు తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -