రాయాలి

ఎంతకూ తగ్గని
ఈ అన్యాయాలపై
ఎంతైనా రాయాలి
ఆవిరైపోతున్న
ఆశల కోసం
అలుపెరగకుండా రాయాలి
విరామమెరుగని
ఈ దాడులపై
విపులంగా రాయాలి
నలిగిపోతున్న జీవితాల కోసం
సజీవంగా రాయాలి
బలైపోతున్న కుటుంబాల కోసం
క్లుప్తంగా రాయాలి
నీరుగారి పోతున్న
ఆశయాల కోసం
నిశితంగా రాయాలి
పేదరికంపై
పెద్ద ఎత్తున రాయాలి
ఆకలి కేకల కోసం
అణువణువునా రాయాలి
నిరుద్యోగంపై
నిలువెత్తున రాయాలి
దుష్టులపై దీర్ఘంగా రాయాలి
దుర్మార్గ పాలనపై
దూర దృష్టితో రాయాలి
మార్పు కోసం రాయాలి
సమాజాన్ని
మార్చడానికై రాయాలి
– కీర్తి ఇనుగుర్తి

Spread the love