జనచైతన్య యాత్రకు సంఘీభావం తెలపండి

– వివిధ రాజకీయ పార్టీలకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రకు సంఘీభావం తెలియజేయాలంటూ వివిధ రాజకీయ పార్టీలను ఆ పార్టీ కోరింది. ఈ మేరకు బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఆఫీస్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, వైఎస్‌ఆర్‌టీపీ ఆఫీసు ఇన్‌చార్జీ వెంకటేష్‌లను అయా పార్టీల కార్యాలయాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజి నరసింహరావు, టి జ్యోతి, టి సాగర్‌ కలిసి విజ్ఞప్తి చేశారు. వివిధ జిల్లాల్లో యాత్రకు సంఘీభావం తెలియజేస్తామని వారు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Spread the love