శ్రీఆంజనేయ శివ పంచాయతన నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో శ్రీఆంజనేయ,శివ పంచాయతన నూతన స్థిర విగ్రహ ప్రతిష్టపన మహోత్సవం ఈనెల 21న బ్రహ్మముహూర్దన ఉదయం 4గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్ష స్వీకారం, బుత్విక్ వర్ణానం, నవగ్రహ, యోగిని, వాస్తు క్షేత్ర పాలన, బ్రహ్మాది మండల పూజలు, అగ్ని ప్రతిష్ట దేవత హోమాలు, విగ్రహాజలాది వాసాలు, మంగళ హారతి ప్రసాద వితరణ జరిగింది. 20న శనివారం గణపతి పూజ, పుణ్యాహవచనం, విగ్రహ పాలాభిషేకం, స్థాపిత దేవత పూజలు, హోమాలు, విగ్రహ ధ్యానపల, పుష్ప శయాది వాసాలు, ప్రసాద వితరణ జరుగుతుందని, 21న  ఆదివారం ఉదయం 4గంటలకు లక్ష్మీ నారాయణ హోమం, గర్తన్యాసం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ఠ, తృక్ బలి, డీక్ బలి, పూర్ణాహుతి అనంతరము, సందర్శకుల దర్శనం జరుగుతుందన్నారు. ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో సందర్శకులు హాజరు కావాలని కోరారు. మూడురోజులపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.
Spread the love