బీజేపీకి బీ-టీమ్‌ : సిద్ధరామయ్య

B-Team for BJP: Siddaramaiahబెంగళూరు: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌ పొత్తుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. జేడీఎస్‌..బీజేపీకి ‘బీ’టీమ్‌ అన్న సంగతి దీంతో నిర్ధారణ అయ్యిందని ఆయన చెప్పారు. హూబ్లీ విమానశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మేము వాళ్లను (జేడీఎస్‌) బీజేపీకి బీ టీమ్‌ అన్నప్పు డల్లా మాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోయారు. ఇప్పుడు వాళ్లే బీజేపీతో పొత్తు అంటున్నారు. పార్టీ పేరులో మాత్రమే ‘సెక్యులర్‌’ (లౌకిక వాదం) అని వేసుకున్నారే కానీ మతతత్వ బీజేపీతో అంటకాగుతూనే వున్నారు’ అని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ మను గడ కోసం తమ పొత్తులుంటాయని మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత హెచ్‌డి దేవేగౌడ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ‘అంటే వాళ్లకు ఒక సిద్ధాంత లేదు. నియమం లేదు. అధికారం కోసం ఎవ్వరితోనైనా పొత్తు పెట్టుకుం టారు’ అని ఆయన విమర్శించారు.
పొత్తుపై ఎలాంటి చర్చ జరగలేదు : కుమారస్వామి
బీజేపీతో పొత్తుపై ఎలాంటి చర్చలు జరగలేదని మాజీ ముఖ్య మంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి తెలిపారు. బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు. ‘యడ్యూరప్ప వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. ఇప్పటివరకు బీజేపీ-జేడీ(ఎస్‌) మధ్య లోక్‌సభ సీట్ల పంపకంపై గానీ, పొత్తుపై గానీ ఎలాంటి చర్చ జరగలేదు. తాము స్నేహపూర్వకంగా రెండు, మూడు సార్లు కలిశాం.
మున్ముందు ఏం జరు గుతుందో చూద్దాం. ప్రజల ముందుకు వెళ్లడానికి ముందే తాము కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది’ అని కుమారస్వామి అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీ(ఎస్‌) కలిసి పోటీ చేస్తాయని, జేడీ(ఎస్‌) నాలుగు లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ 24 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని బిఎస్‌ యడ్యూ రప్ప పేర్కొన్న సంగతి తెలిసిందే.

Spread the love