తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సిద్ధరామయ్య

కర్నాటక: సీఎం సిద్ధరామయ్య 2023-2024 ప్రభుత్వ బడ్జెట్‌ను అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో, మొత్తం 18 శ్లాబ్‌లపై ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌పై ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని 20 శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. బీరుపై అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని 175 శాతం నుంచి 185 శాతానికి పెంచనున్నారు. కర్నాటక బడ్జెట్‌ మొత్తం రూ. 3,27,747 కోట్లుగా అంచనా వేస్తూ ప్రకటించారు. ఈ క్రమంలో ఐదు హామీల పథకాలతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇచ్చిన 5 హామీలకు రూ.52 వేల కోట్లు కేటాయింపు ఉంటుందని, కోటి కంటే ఎక్కువ కుటుంబాలకు లబ్ది జరుగుతుందని, ఇది దేశంలోనే మొదటిసారిగా అమలు చేయబడుతుందని సిద్దరామయ్య ప్రసంగించారు. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ‘మా ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,50,933 కోట్లు, మూలధన వ్యయం రూ. 54,374 కోట్లు, రుణాల చెల్లింపు రూ. 22,441 కోట్లు కేటాయించారు. విద్యకు రూ.37,587 కోట్లు, స్త్రీ, శిశు అభివృద్ధికి రూ. 24,166 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్‌ కేటాయింపులో వరుసగా 11%, 7 శాతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 14,950 కోట్లు కేటాయించారు.

Spread the love