మణిపూర్‌పై జోక్యం చేసుకుంటాం

– అమెరికా దౌత్యవేత్త వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్‌
న్యూఢిల్లీ : మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై అమెరికా దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. మణిపూర్‌ హింసాకాండపై భారత్‌లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్‌ గార్సెట్టి ‘మణిపుర్‌లో ప్రస్తుతం జరుగుతోన్న ఆందోళనలు వ్యూహాత్మకమైనవని నేను అనుకోవడం లేదు. దీని వెనక మానవీయ కారణాలున్నాయని భావిస్తున్నాను. ఇలా హింసాత్మక ఘటనల్లో మహిళలు, చిన్నారులు మరణిస్తున్నప్పుడు చెందుతున్నప్పుడు.. వాటి గురించి స్పందించడానికి భారతీయుడినే కావాల్సిన అవసరం లేదు. మీరు కోరితే.. మేం అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మనీష్‌ తివారీ స్పందిస్తూ ‘నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఒక అమెరికా రాయబారి భారత అంతర్గత వ్యవహారాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తానెప్పుడూ వినలేదు’ అని విమర్శించారు.

Spread the love