– మెయిటీ, కుకీల మధ్య గొడవకు మతం రంగు
– ఇరు వర్గాల మధ్య ఘర్షణలతో అతలాకుతలం
మెయిటీలదే ఆధిపత్యం
మణిపూర్‌లో మెయిటీలు పైచేయి సాధించారని సామాజికవేత్తలు, నిపుణులు వెల్లడించారు. అయినప్పటికీ.. వారు తమను గిరిజనులుగా గుర్తించాలని డిమాండ్ చేయ టం సందేహాస్పదంగా ఉన్నదన్నారు. కొండ ప్రాంతాలపై ఆధిపత్యం చలాయించేందుకే ఈ ఎత్తుగడ అంటూ కుకీలు అంటున్నారు. రాజ్యాంగం, ఇతర చట్టాలు గిరిజనులకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించాయి. వారి భూములను గిరిజనేతరులు కొనటం, బదిలీ చేయించుకోవటం లాంటివి చట్టవిరుద్ధం. అయితే, మెయిటీ ప్రజలు గిరిజన హోదాను పొందటం వల్ల ఇక్కడి భూములపై ఆధిపత్యం చలాయించా లని చూస్తున్నారని కుకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చారిత్రక వైరుధ్యాలను పెంచిన అధికార పార్టీ
న్యూఢిల్లీ : బీజేపీ స్వార్థపూరిత మత రాజకీయాలకు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ‘గిరిజన హోదా’పై రాష్ట్రంలో కుకీలు, మెయిటీ లు అనే రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర హింసాత్మక పరిస్థితులకు దారి తీసిన విషయం విదితమే. దాదాపు 30 రోజులకు పైగా రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలొన్నాయి. ఈ హింసలో దాదాపు వంద మంది వరకు మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. 37 వేల మందికి పైగా సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. భారీగా ఆస్థి నష్టం జరిగింది. ఆదివాసీ హోదాపై చెలరేగిన వివాదం కావటం.. గిరిజనుల్లో అత్యధికులు క్రైస్తవులే కావటంతో 40కి పైగా చర్చిలను ఆందోళనకారులు తగులబెట్టారు.
వివాదం ఏమిటి?
మణిపూర్‌లో కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రజల లో కుకీలు ఒకరు. వీరిలో ఎక్కువ మంది క్రైస్తవులే ఉంటా రు. ఇక మైదానాలు, లోయ ప్రాంతంలో ఉండే వారు మెయిటీ వర్గం ప్రజలు. వీరు హిందూ మతానికి చెందినవారు. అయితే, ఈ మెయిటీ ప్రజలు తమకు గిరిజన హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆ వర్గం ప్రజలు ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు సైతం చేపట్టారు. మెయిటీల డిమాండ్‌ను కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారికి గిరిజన హోదాను కల్పించొద్దని కుకీలు అంటున్నారు. రాష్ట్ర హైకోర్టు మెయిటీలను ఎస్టీ జాబితాలో చేర్చటాన్ని పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించగా.. హైకోర్టు తీర్పు సరైనది కాదని సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే.
కుకీలలో బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత
అయితే, రాష్ట్రంలో బీజేపీ సర్కారు అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ కూడా సాక్షాత్తూ మెయిటీ వర్గానికి చెందినవారు. ముఖ్యమంత్రి మెయిటీ వర్గం కావటం, అందులోనూ మెయిటీలంతా హిందువులు కావటంతో బీజేపీ దీనిని రాజకీయంగా తనకు అనుకూలం గా మలుచుకోవాలనుకుంటున్నదని సామాజిక వేత్తలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సీఎం మెయిటీ వర్గం వ్యక్తి కావటంతో ఆయనను కుకీ ప్రజలు నమ్మటం లేదు. కొండలు, లోయల మధ్య అసమాన అభివృద్ధి, మౌలిక సదుపాయాలలో అసమానతల కారణంగా గిరిజన ప్రజలలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది.
అన్నింటిలోనూ ‘కొండ ప్రాంతం’పై వివక్ష
ఈ విషయంలో కొండలు, లోయల మధ్య అసమాన బడ్జెట్ కేటాయింపుల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆల్ఫ్రెడ్ కనంగమ్ కొన్ని వాస్తవాలను బహిర్గతం చేశారు. 2016 నుంచి 2021 మధ్య బడ్జెట్‌లో రూ.22 వేల కోట్ల ప్రణాళికా నిధులు కేటాయించగా గిరిజనులకు రూ.500 కోట్ల లోపే అందటం గమనార్హం. కొండ ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు 20 మంది కాగా.. లోయ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గిరిజన సంక్షేమానికి కేటాయిం చిన నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి, దారి మళ్లింపులపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటు రాజకీయంగా, సామా జికంగా, ఆర్థికంగా కుకీలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటు న్నారని విశ్లేషకులు వెల్లడించారు. అభివృద్ధి లేకపోవటంతో కనీస ప్రాథమిక అవసరాలకు కూడా కుకీలు నోచుకో లేకపోతున్నారు. పేదరికం పెరగటం వలన నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితి కుకీలలో నెలకొన్నదని చెప్పారు.
‘లోయలో మతఛాందసవాదానికి బీజేపీ కారణం’
ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్న ఈ వివాదం మరింత తీవ్రం కావటం, లోయలో మత ఛాందసవాదం పెరిగి పోవటానికి బీజేపీ అను సరిస్తున్న రాజకీయ వైఖరే కారణమని సామాజిక, ప్రజా సంఘాల నాయకు లు, కార్యకర్తలు ఆరో పించారు. సహజంగా హిందూత్వ, జాతీయ వాద రాజకీయాలు చేసే బీజేపీ.. మణిపూర్‌లో మెయిటీ, కుకీల మధ్య దానిని ప్రయోగిస్తున్నదని తెలి పారు. ఈ విషయాన్ని హిందూ, క్రైస్త వుల మధ్య గొడవగా బీజేపీ, దాని అనుబంధ సంఘాలు ప్రచా రం చేస్తున్నాయి. కుకీల స్థానికతనూ వారు ప్రశ్నిస్తున్నారు. వారు ఇక్కడి వారు కాదనీ, మయన్మార్ (బర్మా) నుంచి ఇక్కడకు వచ్చి నివసిస్తు న్నారని జాతీయ వాదం పేరుతో ఉద్రిక్తతలను నెలకొల్పు తున్నదని అన్నారు.
చర్చిలు, తమ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని మణిపూర్‌లో స్థానిక చర్చి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్‌లోని హింసాకాండపై ఫోరమ్ ఆఫ్ రిలీజియస్ ఫర్ జిస్టిస్ అండ్ పీస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 2017లో మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెయిటీ జాతీయవాదం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మతకలహాలకు బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు కారణమని కుకీలు ఆరోపించారు. పోలీసు స్టేషన్‌లు, పోలీసు శిక్షణా కేంద్రాల్లోకి మెయిటీ మిలీషియాలు ప్రవేశించటం, పోలీసులు చూస్తుండగానే ఆయుధాలు స్వాధీనం చేసుకోవటం, సహాయక శిబిరాల్లో ఉన్న కుకీలపై కాల్పులు జరపటం వంటివి అనేకం చోటు చేసుకున్నాయని చెప్పారు.
మెయిటీలు పదిశాతమే
మణిపూర్‌లో పదిశాతం మంది మాత్రమే మెయిటీలు ఉన్నారు. వీరు లోయ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కుకీలు, నాగాలతో సహా వివిధ గిరిజన తెగలు 90 శాతం వరకు ఉన్నారు. వీరు కొండ లలో నివసిస్తున్నారు. లోయలో విశ్వ విద్యాల యాలు, మెడికల్, ఇంజినీ రింగ్, ఆస్పత్రుల వంటి అభి వృద్ధి ఉంటుంది. కానీ కొండ ప్రాంతంలో ఇవేమీ కనిపిం చవు.
కుకీలపై విషప్రచారం
రెండు సార్లు బీజేపీ తరఫున బీరెన్ సింగ్ ముఖ్య మంత్రిగా పని చేసిన సమయంలో కుకీలపై మెయి టీలు అనేక అపవాదులు సృష్టించారు. ముఖ్యంగా వీరు మయ న్మార్ నుంచి వచ్చిన అక్రమ వలస దారులనీ, డ్రగ్ దందా చేసేవా రని కుకీలపై ప్రచారం చేశారు. కాగా మణి పూర్‌లో గిరిజనుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను నెరవేర్చటానికి మణిపూర్‌లోని కుకీ- జోమి -మిజో-హ్మర్ గిరిజనుల కోసం రాష్ట్రం, యూటీ లేదా టెరి టోరియల్ కౌన్సిల్ వంటి ప్రత్యేక పరిపాలనను ఏర్పాటు చేయాలని మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ డిమాండ్ చేస్తున్నది.
కాగా, రాష్ట్రంలో దారుణ హింస చెలరేగినప్పటికీ.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో నిమగమైందని విశ్లేషకులు ఆరోపించారు. మొత్తానికి బీజేపీ స్వార్థపూ రిత రాజకీయాలు చారి త్రక వైరుధ్యాలను మరింత పెంచాయని తెలిపారు.