లైంగిక దాడులను అరికట్టాలి : మల్లు లక్ష్మి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
త్రిపురలో ఇటీవల మహిళలు, బాలికలపైన సామూహిక లైంగిక దాడులు పెరుగుతున్నాయని వీటిని అరికట్టాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం పార్కు చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు 12 మంది బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరిగాయని తెలిపారు. ఈ దారుణాలను అరికట్టటానికి త్రిపుర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న దని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దోషులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. మైనర్‌ బాలికలపై లైంగిక దాడులు జరుగు తుంటే..ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం అత్యంత దారుణమని విమర్శించారు. బీజేపీకి సంబంధించిన వారే ఈ అకృత్యాలకు ఒడిగడుతున్నారని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి, మహిళా కమిషన్‌కు ఇచ్చినప్పటికీ సర్కారులో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను అరెస్టు చేసే వరకు జిల్లాల్లోనూ ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఎన్‌ ఆశాలత, ఎమ్‌. లక్ష్యమ్మ, సహా యకార్యదర్శులు కె. నాగలక్ష్మి, కె. గీతరాణి, పి. శశికళ, ఎమ్‌. వినోద, కమిటీ సభ్యులు, ఎ. పద్మ, నర్మద, మస్తానీ, నవీన, అనిత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love