బీజేపీ కుంభకోణాలపై విచారణ

– ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : గత బీజేపీ ప్రభుత్వ పాలనలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపించాలని కర్నాటకలోని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం అధికారికంగా ప్రకటించారు. బిట్‌కాయిన్‌ స్కాం, నీటి పారుదల ప్రాజెక్టులు, టెండర్లు, ప్రభుత్వ శాఖల్లో 40 శాతం కమిషన్‌, కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో వైద్య పరికరాలు, ఔషధాలు కొనుగోలు.. వంటి స్కామ్‌లపై విచారణ జరిపేందుకు పలు ఏజెన్సీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే మెడికల్‌ కాలేజీలకు కమిషన్‌ ఆధారంగా స్టేటస్‌లు ఇవ్వడం, పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామకాల కుంభకోణంపై కూడా విచారణ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Spread the love