ఫైల్‌నేమ్‌ : బైయానియల్‌ పోల్స్‌

– జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
న్యూఢిల్లీ : పది రాజ్యసభ స్థానాలకు జులై 24న ఎన్నికలు నిర్వహించినున్నట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) మంగళవారం ప్రకటించింది. జులై 28 నుంచి ఆగష్టు 18 లోపు 10 మంది రాజ్యసభ సభ్యుల ఆరేళ్ల పదవీకాలం పూర్తవతుందని ఇసి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పదవీకాలం పూర్తవుతున్న ఎంపిల్లో కేంద్ర మంత్రి ఎస్‌ జైశంకర్‌, టిఎంసి నాయకులు డెరెక్‌ ఓ’ బ్రెయిన్‌, బిజెపి ఎంపి సభ్యులు వినరు డి టెండూల్కర్‌ (గోవా), జుగల్సాన్హా లోఖనందవాలా, దినేష్‌చంద్ర అనవదియా (గుజరాత్‌) ఉన్నారు. అలాగే, టిఎంసి సభ్యులు డోలా సేన్‌, సుస్మితాదేవ్‌, శాంతా ఛెత్రి, సుఖేందు శేఖర్‌ రారు (పశ్చిమ బెంగాల్‌), కాంగ్రెస్‌ సభ్యులు ప్రదీప్‌ భట్టాచార్య కూడా ఆగష్టుతో పదవీ విరమణ చేయనున్నారు. జులై 24న సాయంత్రం ఐదు గంటల వరకూ ఎన్నికలు జరగనున్నాయని, ఒక గంట తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఇసి తన ప్రకటనలో తెలిపింది.

Spread the love