ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
జీడిమెట్ల 132 డివిజన్‌ పరిధిలోని గోదావరి హౌమ్స్‌లో ఎస్‌.ఎన్‌. డి.పి. ఆధ్వర్యంలో రూ.69 కోట్లతో చేపడు తున్న వర్షపు నీటి నాలా నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. 90 శాతం పనులు పూర్తి కావడంతో, మిగిలి ఉన్న 10 శాతం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ నరేందర్‌, ఏఈ రామారావు, కాలనీవాసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Spread the love