రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్న రామచందర్‌ యాదవ్‌

నవతెలంగాణ-శామీర్‌ పేట
తెలంగాణ అభివద్ధి కాంగ్రేస్‌ పార్టీ తోనే సాధ్యమని రామచందర్‌ యాదవ్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ కి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, బి ఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రామచందర్‌ యాదవ్‌ ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే కాగా గురువారం టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాలువాతో రామచందర్‌ యాదవ్‌ ను రేవంత్‌ రెడ్డి సత్కరించారని యాదవ్‌ పేర్కొన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన నిజమైన ఉద్యమకారులంతా కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపు నిచ్చారని రామచందర్‌ యాదవ్‌ తెలిపారు. అయితే తూంకుంట మున్సిపల్‌ నుంచి త్వరలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణ ఉద్యమం లో క్రియాశీలకంగా పనిచేసి నిరాదరణకు గురి అయిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని రామచందర్‌ యాదవ్‌ అన్నారు. తూంకుంట మున్సిపల్‌ కాంగ్రెస్‌అధ్యక్షులు భీమిడి జైపాల్‌ రెడ్డి , తూం కుంట మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీనివాస్‌ యాదవ్‌ , లక్ష్మాపూర్‌ ఉపసర్పంచ్‌ కటికెల వైద్యనాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love