ఆదివాసీ విద్యార్థులకు సామాజిక అన్యాయ వేదిక.. మడే పూర్ణిమ చేయూత

నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల భూపతిపూర్ ఆదివాసి గిరిజన గ్రామంలో ని ఆదివాసి విద్యార్థులకు ములుగు జిల్లా సామాజిక న్యాయ వేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు మడే పూర్ణిమ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ  ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి మడే బిక్షపతి లు సోమవారం పిల్లలకు నోట్ బుక్స్, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, బలపాలు అందించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ వేదిక జిల్లా మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో రకాలుగా పథకాలను అందిస్తుంది, మీ పిల్లలను ఉన్నత చదువులు చదువుకోవడానికి  హాస్టళ్లను అందుబాటులో ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చదువును మధ్యలో ఆపేయకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని, బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కాటాపూర్ మాజీ సర్పంచ్ లు ముజాఫర్ హుస్సేన్, ఎట్టి సమ్మక్క, బడే రాంబాబు, జిల్లా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పుల రవీందర్, గ్రామ పెద్దలు తల్లడి లక్ష్మయ్య, నర్సయ్య, తాటి మల్లయ్య, మహిళా నాయకురాలు పట్టం నరసక్కా, తాటి సుశీల, విద్యార్థిని విద్యార్థులు ఆదివాసి యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love